భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అన్నారు. ఈ విషయంలో తమ దేశం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. గురువారం ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా స్టార్మర్ మాట్లాడుతూ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. ఇండియా, యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక చారిత్రక మైలురాయి అని మోదీ తెలిపారు.