2030 కామన్ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపిక అయింది. దీంతో 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2008 తర్వాత భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వేదికగా నిలవనుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ క్రీడా ప్రతిష్ఠను ఈ నిర్ణయం మరింత పెంచుతుంది.