బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు యూనస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆగ్రహంతో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే దుస్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన భారత్, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే జనపనార దిగుమతులను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలోని నవా షేవా పోర్ట్ మినహా మరెక్కడి నుంచీ జనపనారను అనుమతించబోమని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది.