ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ - 2025లో భారత జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. విశాఖపట్నంలో ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 330 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హీలే 142 పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో శ్రీచరణికి 3, దీప్తి, అమన్‌జోత్ చెరో రెండు వికెట్లు తీశారు.