2046 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ప్రధాని మోడీ ఆకాంక్షించిన 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే దశాబ్దంలో సగటున 7% వాస్తవ జీడీపీ వృద్ధి నమోదైతే, డాలర్ పరంగా 10% వార్షిక వృద్ధి సులువుగా సాధ్యమవుతుందని ఆయన వివరించారు. 2000-2024 మధ్య భారత్ డాలర్ పరంగా సగటున 8.8% వృద్ధిని నమోదు చేసిందని, భారత ప్రగతిపై వచ్చిన ప్రతికూల కథనాలను ఆయన తోసిపుచ్చారు.