భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, మార్చి నాటికి ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయని, పలు అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయం సాధిస్తున్నారని తెలిపారు. అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్, భారత్ తరపున వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. కొన్ని పంటలు, మాంసం, ఉత్పత్తుల విషయంలోనే భారత్ నుంచి వ్యతిరేకత వస్తోందని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ పేర్కొన్నారు.