భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని మొదటి భాగం ఈ క్యాలెండర్ ఏడాదిలోనే ఖరారయ్యే అవకాశం ఉందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచ విపణిలో ప్రతికూలతలున్నా, ఇరుదేశాల మధ్య చర్చల్లో గణనీయ పురోగతి ఉందని ఆయన శుక్రవారం 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. అయితే, వాణిజ్య ఒప్పంద చర్చలను ఎప్పుడూ అంచనా వేయలేమని, ఏ చిన్న అంశంలో సయోధ్య కుదరకపోయినా ఒప్పందం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.