ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమికి గౌతమ్ గంభీర్ ప్రయోగాలే కారణమని ముఖ్యంగా ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ ను ఆడించకపోవడం పెద్ద తప్పిదమని అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు కూడా జట్టు కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా, షమీ, జడేజా వంటి కీలక ఆటగాళ్లను పక్కన పెట్టడం, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.