ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల కబడ్డీ ఫైనల్లో భారత్ ఇరాన్‌పై 40-34 పాయింట్ల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 4కు చేరింది. అంతకుముందు మహిళల కబడ్డీలోనూ భారత జట్టు ఇరాన్‌ను ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది.