ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ ఇచ్చిన 252 పరుగులు లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో పూర్తి చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించగా.. శ్రేయాస్ 48, రాహుల్ 33, గిల్ 31 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు తీశారు.