మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఓపెనర్ జైస్వాల్ (116*), రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65*) చెలరేగిన వేళ.. సఫారీలు నిర్దేశించిన లక్ష్యం చిన్న బోయింది.