వెల్లింగ్టన్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్ చేయనుంది. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒక్కో ఇన్నింగ్స్‌ను 47 ఓవర్లకు కుదించారు. కాగా ఈ మ్యాచ్ కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే టాస్ ఆలస్యం అయింది. తొలి వన్డే కూడా వర్షం కారణంగా DLS పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే.