మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్

భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచారు. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు 52 రన్స్ తేడాతో గెలిచి తొలిసారి వన్డే వరల్డ్ కప్‌‌ను సగర్వంగా ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 స్కోరు సాధించింది. ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.

సంబంధిత పోస్ట్