వియ‌త్నాంలోని రెస్టారెంట్‌లో భార‌త ఫ్యామిలీ ర‌చ్చ‌ (వీడియో)

వియత్నాంలోని హో చి మిన్ సిటీలోని ‘బాంబే బైట్స్’ ఇండియన్ రెస్టారెంట్‌లో ఒక భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. పిల్లలు టిష్యూ పేపర్లు విసురుతూ, ప్లేట్లు, గ్లాసులు పగలగొట్టడంతో పాటు, తల్లిదండ్రులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పంచుకుంటూ, ఆ కుటుంబం ఆస్తికి నష్టం కలిగించి, సిబ్బందిని అవమానించిందని ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్