ఆసియా క్రీడలు: పాక్‌ను చిత్తు చేసిన భారత్

ఆసియా క్రీడల పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత్‌ ఉత్కంఠ విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి నిమిషం వరకు స్కోరు 3-3గా ఉండగా.. అభిషేక్‌ కీలక గోల్‌ చేసి భారత్‌కు 4-3తో విజయాన్ని అందించాడు. సర్కిల్‌ అంచు నుంచి అభిషేక్‌ కొట్టిన షాట్‌ పాక్‌ రక్షణను దాటడంతో భారత జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంతో భారత్‌ ఆసియా క్రీడల హాకీ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు 1998 తర్వాత తొలిసారి ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ ఫైనల్‌కు చేరాయి.

సంబంధిత పోస్ట్

✕
✕