సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమవారం జరిగిన గోల్డెన్ జూబ్లీ పరేడ్‌లో భారత ఆర్మీ, నౌకాదళ దళాలు కవాతు నిర్వహించాయి. భారత సైనికులు కవాతు చేస్తుండగా.. వారికి గౌరవ సూచకంగా ప్రధాని మోదీ లేచి నిలబడటం కార్యక్రమానికి విశేషంగా నిలిచింది. అస్సాం రెజిమెంట్ సైనికులు తమ గీతం ఆలపిస్తూ ఆకట్టుకున్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ తార్కష్, ఐఎన్‌ఎస్ ఇక్షాక్ నౌకలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.