కెనడాలో భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలు

కెనడాలోని వాంకోవర్‌లో 2022 అక్టోబర్ 17న జరిగిన విశాల్ వాలియా హత్య కేసులో భారత సంతతికి చెందిన బాలరాజ్ సింగ్ బాస్రాకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో మొత్తం ముగ్గురు దోషులుగా తేలగా, ఇద్దరు యువకులకు ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారైంది. విశాల్‌ను కారులో వెళ్తుండగా కాల్చి చంపి, సాక్ష్యాలు మాయం చేసేందుకు కారును తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టు జ్యూరీ, పెరోల్ లేని శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్