పావురాలకు మేత వేసినందుకు మహిళకు రూ.2లక్షల ఫైన్

సింగపూర్‌లో పావురాలకు మేత వేసినందుకు భారత సంతతికి చెందిన 71 ఏళ్ల మహిళ షమ్లాకు కోర్టు 3,200 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.2.27 లక్షలు) జరిమానా విధించింది. ఆరు నెలల వ్యవధిలో తొమ్మిది సార్లు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ శిక్ష పడింది. గతంలో కూడా ఆమెకు 1,200 డాలర్ల జరిమానా పడింది. పారిశుద్ధ్యం, పర్యావరణ సమతుల్యత కోసం సింగపూర్ ప్రభుత్వం ఈ కఠిన చట్టాలను అమలు చేస్తోంది. జరిమానా మొత్తాన్ని తగ్గించాలని, కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆమె కోరినా కోర్టు అంగీకరించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్