పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. భారత్ ర్యాంకు ఎంతంటే..?

ప్రపంచంలో పాస్‌పోర్ట్ శక్తిని తెలిపే 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్' 2026 నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది, అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకునే సౌకర్యంతో ప్రయాణించవచ్చు. దాదాపు 17 ఏళ్ల క్రితం (2008-09లో) భారత్ ఇదే ర్యాంకుల్లో ఉండేది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా, జపాన్, దక్షిణ కొరియా కూడా అగ్రస్థానాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్