నకిలీ పత్రాలతో భారత పాస్‌పోర్ట్.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్

చెన్నై విమానాశ్రయంలో నకిలీ పత్రాలతో భారత పాస్‌పోర్ట్ పొంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశ్, శ్రీలంక దేశస్థులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. షిముల్ దాస్ (బంగ్లాదేశ్) 2017లో పర్యాటక వీసాపై వచ్చి, నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ పొంది మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెల్వి వలంతియా ఫీడ్రైజ్ (శ్రీలంక) ఊటీలో పుట్టి, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్‌పోర్ట్ పొంది శ్రీలంక వెళ్లేందుకు యత్నించింది. వీరిద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు.

సంబంధిత పోస్ట్