ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాకేశ్ చౌహాన్ అనే నావికుడు వెనెజువెలాలో మరణించడంతో మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. అయితే అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టమ్ నిర్వహించారు. దీంతో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు తదితర కీలక అవయవాలు బాడీలో లేనట్లు తేలింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) ఎక్స్ వేదికగా వెల్లడించింది. వెనెజువెలా అధికారులను సంప్రదిస్తున్నట్లు పేర్కొంది.