చైనాకు మళ్లిన చమురు నౌక ఇప్పుడు ఇండియాకు తిరిగి రాబోతోంది. ఇరాన్ నుంచి ఏడేళ్ల వస్తున్న ఈ చమురు నౌకతో భారత చమురు కష్టాలు తీరే అవకాశాలున్నాయి. 'జయ' అనే నౌక తూర్పు తీర ప్రాంతానికి రానుంది. లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ గ్రూప్, కెప్లర్ సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో గతంలో ఇరాన్ నుంచి చమురు కొనుగోలు ఆపేసిన ఇండియా, ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆంక్షలను ఎత్తివేయడంతో తిరిగి దిగుమతి చేసుకుంటోంది. హార్ముజ్ జలసంధి తెరుచుకుంటే మరింత చమురు అందుబాటులోకి వస్తుంది.