హర్మూజ్ జలసంధిలో భారత నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు : ఇరాన్

హర్మూజ్‌ జలసంధిలో భారత నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్‌ మరోసారి ప్రకటించింది. భారత్‌తో పాటు చైనా, ఇరాక్‌, ఖతార్‌ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని ఇరాన్‌ పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ హయత్‌ మొఘద్దమ్‌ తెలిపారు. మరోవైపు అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తూనే, యుద్ధానికీ ఇరాన్‌ సిద్ధమవుతోంది. 10 లక్షల మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా దాడుల నేపథ్యంలో ఖేష్మ్‌ దీవిలో పేలుళ్లు జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕