వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారత షూటర్ ఇషా సింగ్

జర్మనీలోని మునిచ్‌లో జరుగుతున్న ISSF వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆమె 43 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, దక్షిణ కొరియా షూటర్ కిమ్-యేజీ (42 పాయింట్లు) పేరిట ఉన్న గత రికార్డును బద్దలు కొట్టింది. ఈ ప్రపంచ రికార్డుతో కూడిన విజయంపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రీడా ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇషా సింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంబంధిత పోస్ట్