కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలాయి. సెన్సెక్స్ 2078 పాయింట్లు కోల్పోయి 80191.24 వద్ద, నిఫ్టీ 616 పాయింట్లు క్షీణించి 24,704.45 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది.