భారతీయ విద్యార్థికి సిడ్నీ ప్రభుత్వం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రదీప్ అనే విద్యార్థి లాయర్ గా నటిస్తూ ఓ వ్యక్తి నుంచి 2 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు కాజేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. లాయర్ కాకపోయినా తప్పుడు పత్రాలతో నమ్మించి భారీగా నగదు వసూలు చేయడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.