UAEలో భారత వీసా, పాస్‌పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. జూన్ 26 నుంచి ఐదు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సాంకేతిక నిర్వహణ, వ్యవస్థ అప్‌గ్రేడ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అత్యవసర సేవలు మినహా సాధారణ పాస్‌పోర్ట్, వీసా దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తుదారులు తమ అపాయింట్‌మెంట్లు, ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. సేవలు తిరిగి ప్రారంభమయ్యే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది.