భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఐసీసీ ఛైర్మన్ జై షా నుంచి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సగర్వంగా ట్రోఫీ అందుకున్నారు. అనంతరం ట్రోఫీతో మహిళా క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. భావోద్వేగంతో మహిళా క్రికెటర్లంతా ఒకరినొకరు అభినందించుకున్నారు. ఇక స్టేడియంలో ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల కాంతులు వెదజల్లుతూ సాగిన బాణసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Video Credits: Star Sports