ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య వరకు అమెరికా సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో 10,382 మంది భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో 30 మంది చిన్నారులు పెద్దల రక్షణ లేకుండా ఉన్నారు. ఎక్కువ మంది గుజరాత్‌కు చెందినవారే. గతేడాది ఇదే సమయంలో 34,535 మంది పట్టుబడగా, ఈ ఏడాది దాదాపు 70 శాతం తగ్గుదల నమోదైంది. కఠిన చర్యల వల్ల అక్రమ ప్రవేశాలు తగ్గాయని అధికారులు వెల్లడించారు.