ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేంద్ర మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులది తినితిరిగే తత్వం కాదని, మన సంస్కృతిలో పొదుపు మంత్రం పునాదిగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రజలను మరింతగా ప్రోత్సహించాలని మంత్రివర్గ సభ్యులకు ప్రధాని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే దేశం మళ్లీ పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.