ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించగా, టెహ్రాన్ దీనిని ఖండించింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని, వారం రోజుల్లో మూడు నౌకలపై అమెరికా దాడి చేసి ముగ్గురు భారత నావికుల మృతికి కారణమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమపై నిందలు మోపుతోందని ఇరాన్ పేర్కొంది.