స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్లు పతనమైంది. అధిక క్రూడాయిల్ ధరలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 48.78 పాయింట్లు నష్టపోయి 72,480.29 వద్ద, నిఫ్టీ 95.75 పాయింట్లు నష్టపోయి 22,620.45 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 95.81గా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕