రికార్డు గరిష్ఠాల నుంచి నష్టాల్లోకి సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం జీడీపీ గణాంకాలతో గరిష్ఠాలకు చేరిన సూచీలు, అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. రూపాయి విలువ కనిష్ఠానికి చేరడం, వాణిజ్య ఒప్పందంపై స్పష్టత రాకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రియల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యూరబుల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపించాయి. సెన్సెక్స్‌ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641.90 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్లు నష్టపోయి 26,175.75 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 89.56గా నమోదైంది.

సంబంధిత పోస్ట్