వరుసగా ఐదో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు సూచీలకు కలిసివచ్చాయి. సెన్సెక్స్ 383.55 పాయింట్లు పెరిగి 77,301.40 వద్ద, నిఫ్టీ 86.95 పాయింట్లు పెరిగి 23,897.80 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ షేర్లు మినహా ఎఫ్ఎంసీజీ, రియల్టీ, మెటల్ రంగాలు రాణించాయి. బిఈఎల్, టైటాన్ వంటి షేర్లు లాభపడగా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.64గా నమోదైంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 102 డాలర్లుగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕