దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54.30 పాయింట్లు కోల్పోయి 85,213.36 వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్లు నష్టపోయి 26,027.30 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.74గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో పయనించగా.. హిందుస్థాన్ యూనిలీవర్, ట్రెంట్, HCL టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు లాభాలను ఆర్జించాయి.