భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌ను డెవలప్ చేసింది. అస్త్రా క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చేశారు. ఒడిశా తీరంలో డీఆర్డీవో, ఐఏఎఫ్ సంయుక్తంగా సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ ద్వారా ఆ క్షిపణి రెండు సార్లు పరీక్షించారు. హై స్పీడ్ టార్గెట్లను విజయంగా ధ్వంసం చేసింది.