సిబ్బంది వస్త్రధారణ విషయంలో ఇండిగో కొత్త రూల్స్ తెచ్చిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఇండిగో స్పందించింది. తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి సంప్రదాయ గుర్తులపై ఆంక్షలు విధించిందని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఈ కథనాలకు ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఇండిగో సూచించింది.