ఇండిగో సంక్షోభం.. ఢిల్లీలో రూ.1,000 కోట్లు నష్టం

ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం కారణంగా గత 10 రోజుల్లో ఢిల్లీ వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు సుమారు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లిందని ది ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా ఢిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25శాతం తగ్గిందని CTI తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నిత్యం 1.5 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో సుమారు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ ఉంటారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్