TG: అర్హులైన పేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం మంత్రి సురేఖ వరంగల్ ఈస్ట్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపడుతుందన్నారు.