TG: హెచ్ఎండీఏ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సంబంధించిన అలాట్మెంట్ లెటర్లను సోమవారం నుంచి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా వీటిని అందిస్తారు. రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ 2.85 ఎకరాల భూమిలో 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.752-767 కోట్లు ఉంటుందని అంచనా.