TG: దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బ్రతకడమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వికలాంగులకు వారి పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీతక్క ప్రకటించారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. వికలాంగుల నిరుద్యోగుల కోసం జాబ్ పోర్టల్ను ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన దివ్యాంగులను గుర్తించి వచ్చే బడ్జెట్లో స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు మంజూరు చేస్తామన్నారు.