ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫేజ్-1 కింద మంజూరయిన 2.50 లక్షల ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు గడువు విధించింది. ఇందులో గోడలు, స్లాబ్ వరకు పూర్తయిన ఇళ్లను ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని నిర్దేశించింది. ఫేజ్-2లో పూరి గుడిసెలు ఉన్నవారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటివరకు 37వేల దరఖాస్తులను సర్వే చేయగా, 5వేల మందిని అర్హులుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్