TG: హైదరాబాద్‌లోని ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లబ్ధిదారులకు సోమవారం నుంచి అలాట్‌మెంట్ లెటర్ల జారీ చేయనున్నారు. SMS, WhatsApp ద్వారా లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు అందజేస్తారు. TGHB వెబ్‌సైట్‌లోనూ అలాట్‌మెంట్ లెటర్లు అందుబాటులో ఉంటాయి. కాగా రాయదుర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 2.85 ఎకరాల ప్రభుత్వ TGHB భూమిలో 480 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు.