బుల్లెట్‌ ట్రైన్‌ కన్నా వేగంగా ద్రవ్యోల్బణం దూసుకెళ్తోంది: జైరాం రమేష్

దేశంలో మోదీ సర్కార్ ప్రకటించిన బుల్లెట్‌ ట్రైన్‌ ఇంకా రాలేదు కానీ.. ద్రవ్యోల్బణం మాత్రం ఆ రైలుకన్నా వేగంగా దూసుకెళ్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. ‘గత పదిన్నరేళ్లలో ద్రవ్యోల్బణం రెండు-మూడు రెట్లు పెరిగింది. కూరగాయలు, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి’ అని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్