ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది. మానసిక వికలాంగుడైన రోగిని కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు కాలితో తన్నుతూ దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, సంబంధిత మహిళా సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.