గాయాల బెడద.. టీమిండియాకు కొత్త ఆందోళన

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు భారత జట్టు గాయాల సమస్యతో సతమతమవుతోంది. స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కోలుకోగా, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లో పేసర్‌ హర్షిత్‌ రాణా మోకాలి నొప్పితో బాధపడి, కేవలం ఒక ఓవర్‌ మాత్రమే వేసి మైదానం వీడాడు. దీంతో అతడి ప్రపంచకప్‌ లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 240 పరుగులు చేయగా సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్