ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రోనిషా సత్తి తన కాబోయే భర్త ప్రశాంత్ శర్మ వేధింపులకు పాల్పడుతున్నాడని, తనపై నకిలీ సోషల్ మీడియా పేజీ సృష్టించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆమెను జమ్మూలోని ఆసుపత్రిలో చేర్చారు. రోనిషా తల్లి రీనా సత్తి మాట్లాడుతూ, ప్రశాంత్ తన కూతురి నుంచి పది లక్షల రూపాయలకు పైగా తీసుకుని పెళ్లి చేసుకుంటానన్న మాట తప్పాడని, ఆమె ఫోటోలను అప్‌లోడ్ చేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ మోసం చేశాడని ఆరోపించారు.