‘‘బిస్లరీ’’కి బదులుగా కలెక్టర్‌కి ‘‘బిల్సెరీ’’ వాటర్ బాటిల్.. అ తర్వాత ఏమైందంటే(వీడియో)

నిజమైన వాటర్ బాటిల్ పేర్లకు బదులుగా అదే పేరులా కనిపించే వేరే వాటర్ బాటిళ్లను విక్రయించడం చూస్తుంటాం. అయితే, యూపీలోని బాగ్‌పట్ జిల్లా కలెక్టర్ జితేంద్ర ప్రతాప్ సింగ్‌ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. జిల్లాలోని స్థానిక పోలీస్ పోస్టుని సందర్శించిన సమయంలో ‘‘బిస్లరీ’’కి బదులుగా ‘‘బిల్సెరీ’’ పేరు గల బాటిల్ ను ఆయనకు అందించారు. బాటిల్ ను పరిశీలించిన కలెక్టర్.. అది నకిలీదని తేల్చారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో తయారీ సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్