సెమీ కండక్టర్ రంగంలో తమ కంపెనీ రాణించలేకపోవడానికి గల కారణాలను ప్రముఖ చిప్ టెక్నాలజీ సంస్థ ఇంటెల్ సీఈవో లిప్ బు టాన్ విశ్లేషించారు. 30 ఏళ్ల క్రితం తమ కంపెనీ హవా నడిచిందని, ఇప్పుడు అది లేదని తెలిపారు. ప్రపంచంలో వస్తోన్న మార్పుల నేపథ్యంలో టాప్ 10 సెమీ కండక్టర్ కంపెనీల జాబితాలో ఇంటెల్ లేదని ఆయన అంగీకరించారు. ఏఐ చిప్‌ల రూపకల్పనలో ఎన్విడియా బలంగా రాణిస్తోందని వ్యాఖ్యానించారు.