రాష్ట్రంలో ఎండల తీవ్రత.. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి

TG: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి(D) రామగుండం(M) మల్యాలపల్లిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. NLG జిల్లా మునుగోడు మండలంలో 45.8, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.4 డిగ్రీలుగా నమోదయింది. రానున్న 3 రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మే 6 వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్